KRNL: తెలుగు గంగ/సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల కోటాలో నకిలీ సర్టిఫికెట్లు చూపించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఐదుగురిని సేవల నుంచి తొలగించారు. ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదును విచారించిన ఉప లోకాయుక్త పి.రజని ఆదేశాలతో తిరుపతిలోని NTR తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ తక్షణ చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.