ATP: అనుమతులు లేకుండా ఆక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు సీఐ కౌలుట్లయ్య పేర్కొన్నారు. తలగాచిపల్లి క్రాస్ 44వ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎలాంటి అనుమతులు లేకుండా అనంతపురం వైపు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తెలిపారు. వెంటనే 5 ట్రాక్టర్లు పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. డెవర్లపై కేసు నమోదు చేసినట్లు తెలియాజేశారు.