మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను 2026 ప్రథమార్థం తర్వాత ప్రారంభిస్తామని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపాడు. ఇందులో చిరుని ఇప్పటివరకు ఎవరూ చూడని విధంగా కనిపిస్తారని అన్నాడు.