TPT: జిల్లాలో నూతనంగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్లకు ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మార్గదర్శకాలు జారీ చేశారు. ఒంగోలు, నెల్లూరు శిక్షణ కేంద్రాలకు వెళ్తున్న ట్రెయినీలు క్రమశిక్షణ, సమయపాలన పాటించాలన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. పోలీస్ యూనిఫాం గౌరవాన్ని కాపాడుతూ.. ప్రజలకు మర్యాదగా, న్యాయబద్ధంగా సేవ చేయాలని హితవు పలికారు.