ఇకపై రవితేజ తన సినిమాల్లో ‘మాస్ మహారాజా’ ట్యాగ్ వాడొద్దని చెప్పాడని వార్తలొస్తున్నాయి. తాజాగా దీనిపై దర్శకుడు కిషోర్ తిరుమల క్లారిటీ ఇచ్చాడు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా వరకు మాత్రమే ఆ ట్యాగ్ తీసేద్దామని రవితేజ చెప్పారని తెలిపాడు. తాను ఎప్పుడూ కథ, పాత్రను బట్టే సినిమాను ముందుకు తీసుకెళ్తానని, అందుకే ఆయన అలా చెప్పారని పేర్కొన్నాడు.