TPT: గువాహటిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అస్సాం ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయించేందుకు అంగీకరించింది. CM చంద్రబాబు విజ్ఞప్తిపై ఈ నిర్ణయం తీసుకోగా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సానుకూలంగా స్పందించారు. ఇరువురు సీఎంలకు టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. భూమి కేటాయింపు ప్రక్రియలు పూర్తిచేసి, ఆలయ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.