TG: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి కలకలం రేపింది. పశువుల మందపై పెద్దపులి వరుస దాడులు చేస్తున్నట్లు సమాచారం. రామారెడ్డి మండలం మద్దికుంటలో పెద్దపులి ఆవును చంపినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా ఇసాయిపేట, రెడ్డిపేట, చుక్కాపూర్ అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్టు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.