PLD: సత్తెనపల్లి పట్టణంలో గల రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల పూజలలో భాగంగా శ్రీవారిని శ్రీ వేంకట నారసింహ అవతారంగా అలంకరించారు. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాడ వీధులలో శ్రీవారి ఊరేగింపును అంగరంగ వైభవంగా శ్రీవారిని ఊరేగించారు. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.