HYD: జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ప్రత్యేక విండో ఆప్షన్ ద్వారా 27 విలీన స్థానిక సంస్థలను చేర్చారు. దీని ద్వారా ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను ఆన్లైన్లో నేరుగా చెల్లించే అవకాశం కల్పించారు. గ్రేటర్ పరిధిలో విలీనమైనప్పటికీ ఆస్తి పన్ను మాత్రం యధాతధంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.