ATP: SP జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు, ఫ్రిస్కింగ్ ఆపరేషన్లు నిర్వహించారు. సీఐలు, ఎస్సైలు ముఖ్య కూడళ్లు అయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచి తనిఖీలు చేపట్టారు. గంజాయి, నిషేధిత పదార్థాల రవాణాను అరికట్టడంతో పాటు ప్రజల భద్రతను మెరుగుపరచడం లక్ష్యమని పోలీసులు తెలిపారు.