ATP: జిల్లాలోని అంబేద్కర్ నగర్లో వైసీపీ అధినేత YS జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్పొరేటర్ సాకే చంద్రలేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. పేదలకు మిఠాయిలు పంచారు.