SKLM: ఆముదాలవలస రామలింగేశ్వర కోనేరులో ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు జారిపడి మృతి చెందడం పట్ల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిన్నారుల కుటుంబాలకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చెరువులు నీటి ప్రవాహంఉండే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.