SRPT: చిలుకూరుకు చెందిన కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటన ప్రజాస్వామ్యానికే మచ్చ అని టీఆర్పీ అధ్యక్షుడు వట్టె జానయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై మంద కృష్ణ మాదిగ చేపట్టిన న్యాయపోరాటానికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆదివారం ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.