KRNL: ఆదోని పట్టణంలో టీడీపీ యువ నాయకుడు మారుతీ నాయుడు ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు, వ్యాపారవేత్త నందమూరి బాలకృష్ణ కూతురు, యువ పారిశ్రామికవేత్త నారా బ్రాహ్మణి 38వ జన్మదిన వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. మారుతీ నాయుడు కార్యాలయంలో జరిగిన ఈ వేడుకకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.