MDK: తూప్రాన్ పట్టణ పరిధి పోతరాజుపల్లి వద్దగల రెండు కిరాణా దుకాణాల్లో చోరీలు జరిగాయి. శనివారం రాత్రి భగవతి కిరాణా దుకాణం, లక్ష్మీనరసింహ కిరాణా దుకాణ తాళాలు పగలగొట్టి సుమారు రూ. 23 వేల నగదు, కిరాణా సామాగ్రి చోరీ చేశారు. పక్కనే ఉన్న వైన్స్ తాళాలు పగలగొట్టగా భవన యజమాని ఐలేష్ యాదవ్ గుర్తించి, దొంగను పట్టుకోగా తప్పించుకు పారిపోయాడు.