NZM: వర్ని మండలంలో నకిలీ నోట్ల వ్యవహారంపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకుకు రూ. 2.08 లక్షల నకిలీ నోట్లు తెచ్చిన రైతు సాయిలు, అతని కుమారుడితో పాటు ఒక కాంగ్రెస్, ఒక బీజేపీ నాయకుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.