గుంటూరు జిన్నాటవర్ సెంటర్ వద్ద అపస్మారక స్థితిలో దొరికిన అపరిచిత వ్యక్తి చికిత్స పొందుతూ మరణించినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. ఈ నెల 18న స్థానికులు ఆ వ్యక్తిని జీజీహెచ్‌కి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ప్రస్తుతం మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచామని, మృతుడికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.