E.G: దేవరపల్లి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్తు లైన్లో మరమ్మత నిమిత్తం ఆదివారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ ఎన్.నారాయణ అప్పారావు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.