E.G: సంసద్ క్రీడా మహోత్సవ్-2025లో భాగంగా ఆదివారం రాజమండ్రిలో మారథాన్ రన్ నిర్వహించనున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి తెలిపారు. ఆర్ట్స్ కళాశాల నుంచి ఈ పరుగు ప్రారంభం కానుంది. పురుషులకు 5 కి.మీ, మహిళలకు 3 కి.మీ మేర పోటీలు ఉంటాయని, విజేతలకు ఆకర్షణీయ నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు.