KKD: అయిదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని డీఎంహెచ్వో నరసింహానాయక్ కోరారు. ఇవాళ జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన ర్యాలీ శనివారం నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి చేతుల మీదుగా స్థానిక రామారావుపేట యూపీ హెచ్సీలో కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో 61 మొబైల్ టీంలతో 194,437 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామన్నారు.