E.G: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు రాజమండ్రిలో ఘనంగా జరగనుంది. ఆనాల వెంకట అప్పారావు రోడ్డులోని జాగృతి బ్లడ్ బ్యాంక్ సమీప కూడలిలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దియో సాయి ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలో ఎంపీ పురందీశ్వరితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.