NTR: పెనుగంచిప్రోలు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో డ్రాప్స్ తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సీతారాం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.