MDK: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ఝాన్సీ లింగాపూర్ గ్రామ నూతన సర్పంచ్ మానెగల రామకృష్ణయ్యను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధి, విద్యారంగ ప్రగతికి సర్పంచ్ సహకారం అవసరమని వారు పేర్కొన్నారు. సర్పంచ్ రామకృష్ణయ్య మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానని తెలిపారు.