MBNR: తెలంగాణ తొలి తరం ఉద్యమకారిణి స్వర్గీయ టీఎస్ సదాలక్ష్మి విగ్రహాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల దళిత ఫోరం సభ్యులు శనివారం ఎమ్మెల్యేని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో తొలి తరపు ఉద్యమకారుల త్యాగాలు పోరాటాలు రాష్ట్ర సాధనకు పునాదిగా నిలిచాయన్నారు.