NLG: వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. టాలెంట్ ఉన్న పేద విద్యార్థులను గుర్తించి, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగడానికి ఇలాంటి పోటీలు దోహదం చేస్తాయన్నారు. నల్గొండలో జరిగిన ప్రతీక్ ఫౌండేషన్, నల్గొండ ప్రీమియర్ లీగ్ విజేతలకు ఇవాళ బహుమతులను ప్రధానం చేసి మాట్లాడారు.