HNK: మడికొండ దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో నిర్వహించిన CRP EP శిక్షణ కార్యక్రమం నేటితో విజయవంతంగా ముగిసింది. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రెండు వారాలపాటు ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు అధికారులు నేడు సర్టిఫికేట్లు అందజేశారు. కాగా శిక్షణ పొందిన వారు రేపటి నుంచి విధుల్లో చేరనున్నారు.