NLG: గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రద్దు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి ఈ సోమవారం నుంచి యథావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు వారి సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులను సమర్పించవచ్చని పేర్కొన్నారు.