NLG: మిర్యాలగూడ బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎస్కే పాషా బాయ్, ఉపాధ్యక్షులుగా ఉబ్బపల్లి బుజ్జి బాబు, ప్రధాన కార్యదర్శిగా అంగరాజు రాంబాబు, కోశాధికారిగా గోవర్ధన్ రెడ్డిని ఎన్నుకున్నారు. సీఐటీయూ జిల్లా నాయకులు హాజరై మాట్లాడుతూ.. ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.