SRD: మనూరు మండలం శలిగిరా గ్రామ సర్పంచిగా శ్రీశైలం ఎన్నికల్లో విజయం సాధించారు. ఈయన గెలవాలని, గ్రామ పరిధిలోని తండాకు చెందిన విజయ్ అనే యువకుడు తమ ఆరాధ్య దేవత మోతి మాతకు మొక్కుకున్నాడు. శనివారం తండాలోని మోతీ మాత ఆలయంలో నూటొక్క (101) కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నాడు. తన మొక్కు ఫలితం విజయవంతం కావడంతో ఆనందంగా ఉందన్నాడు.