NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని మిర్యాలగూడ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. మిర్యాలగూడ పట్టణంలో రెడ్డి కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లను ఆత్మీయ సన్మానంలో భాస్కర్ రావు పాల్గొన్నారు.