ప్రకాశం: పల్స్ పోలియో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కనిగిరి మున్సిపాలిటీ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. ఆదివారం పోలియో దినం సందర్బంగా కనిగిరి పట్టణంలో ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇవాళ అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా పిల్లలకు మంచి జరుగుతుందన్నారు.