VZM: విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్, అగ్ని వీర్‌కు ఎంపికైన అభ్యర్థుల సన్మాన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్, అగ్నివీర్‌కు ఎంపికైన వారిని మంత్రి అభినందించారు. నమ్మకం, అంకితభావంతో పనిచేసే స్వభావం ఉత్తరాంధ్ర వాసులదన్నారు. డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ అనిల్ పాల్గొన్నారు.