GDWL: కోట్లాది మందికి ప్రాణాధారమైన ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం అంటే పేద ప్రజల కడుపు కాల్చడమే అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ పేర్కొన్నారు. శనివారం ధరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన నిరసనలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉప్పేర్ నరసింహ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థ అని గొప్పలు చెప్పుకుంటూ పేదల ఉపాధిపై ఖర్చు చేయడం లేదన్నారు.