TG: తెలంగాణలో క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే సోనియాగాంధీ పాత్ర, త్యాగం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే డిసెంబరులో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఏసు ప్రభువు బోధనల స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎల్బీస్టేడియంలో ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వంతో పోటీ పడి విద్య, వైద్యం అందిస్తున్నాయన్నారు.