ADB: యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా ఆసక్తి చూపాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను శనివారం ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. క్రీడలతో ఐక్యత, స్నేహభావం పెంపొందుతుందని పేర్కొన్నారు.