WNP: మదనాపురం మండలంలోని సరళ సాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ నుంచి రబీ పంట పొలాలకు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి శనివారం సాగునీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన ఆయకట్టు రైతులతో ముచ్చటించి, పంటల సాగు విధానం, నీటి లభ్యతపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, సాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.