AP: తాగునీటి భద్రత సంక్షేమ పథకం కాదని.. అది ప్రజల జీవన హక్కు అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు శంకుస్థాపంన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇది ఉభయ గోదావరి జిల్లాల ప్రజల దశాబ్ధాల కలకు రూపు దాల్చిన అద్భుత ఘట్టమని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం గర్వకారణమన్నారు.