TG: రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అధికారులతో రోడ్డు భద్రతా మాసోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో ప్రమాద ప్రాంతాలను గుర్తించి వాహనదారులకు తెలిసే విధంగా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు. డిసెంబర్ 31 రోజున స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలన్నారు.