W.G: పాలకొల్లు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ‘ముస్తాబు’ కార్యక్రమం జరిగింది. హెచ్ఎం రాయపూడి భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఏ ఒక్క విద్యార్థి శుభ్రతా లోపం వల్ల అనారోగ్యానికి గురికాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు.