ప్రకాశం: గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి, ఇంటి పన్నులతో ఆదాయ వనరులు సృష్టించుకోవాలని MPDO రాజశేఖర్ బాబు తెలిపారు. పులిచర్ల ఎంపీడీవో కార్యాలయంలో ఓన్ సోర్స్ రెవెన్యూపై పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. పంచాయతీ అభివృద్ధి చెందాలంటే ఆదాయం తప్పనిసరిగా ఉండాలన్నారు. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.