NLG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఈనెల 23న నల్గొండ జిల్లాకు రానున్నట్లు నిన్న జిల్లాలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే నూతన పంచాయతీ పాలకవర్గాల సన్మానోత్సవ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.