KDP: స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పులివెందుల రోటరీపురంలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద శనివారం ప్రజలకు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి ప్రాసెసింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతాయని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాముడు, ఆర్డీవో చిన్నయ్య పాల్గొన్నారు.