ADB: తాంసి మండలంలోని పాలోది గ్రామానికి చెందిన పలువురు నాయకులు, గ్రామ పెద్దలు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్‌ను నేరడిగొండలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సర్పంచ్, ఉప సర్పంచ్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాభిప్రాయం ప్రకారం పని చేయాలని నాయకులకు సూచించారు.