TG: సంగారెడ్డి జిల్లా శ్రీసమర్థ్ పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపుచేసేందుకు పత్తి మిల్లు సిబ్బంది యత్నం చేస్తున్నారు. కంగ్టి మండలం తుర్క వడగమలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.