HYDలో మైనర్లు బండి నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని CP సజ్జనార్ స్పష్టం చేశారు. మైనర్‌తో ప్రమాదం జరిగితే వాహనాన్ని ఇచ్చిన యజమానికే పూర్తి బాధ్యత ఉంటుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు, వాహన యజమానులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు, జరిమానాలు విధిస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని కోరారు.