కర్నూలు జిల్లా నూతన అధ్యక్షురాలిగా ఆదోని నియోజకవర్గానికి చెందిన గుడిసె కృష్ణమ్మను పార్టీ అధిష్టానం నియమించింది. 2004లో ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేసిన సేవలకు గాను ఈ బాధ్యతలు అప్పగించినట్లు ఆమె తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో ఈ పదవి లభించిందన్నారు.