SRPT: గ్రామాల్లో నూతన పాలకవర్గం కొలువుతీరడానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22వ తేదీన గ్రామాల్లో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇప్పటికే గ్రామపంచాయతీలకు రంగులు వేసి తీర్చిదిద్దుతున్నారు. నడిగూడెం మండల వ్యాప్తంగా 16 సర్పంచులు,148 వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసే రోజే తొలి సమావేశం నిర్వహించనున్నారు.