ATP: గుత్తి పట్టణములో ఇవాళ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు చేశారు. భారీ కేక్‌ను కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు చేశారు. అనంతరం అనాధలకు, యాచకులకు దుప్పట్లను పంపిణీ చేశారు.