అనకాపల్లి: జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చోడవరం నియోజకవర్గానికి చెందిన బత్తుల తాతయ్య బాబు నియమితులయ్యారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోటవురట్ల మండలానికి చెందిన లాలం కాశీనాయుడిని పార్టీ అధిష్ఠానం నియమించింది. వీరిద్దరూ రెండోసారి ఆయా పదవుల్లో నియమితులయ్యారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు.