MDK: ఆదర్శ గ్రామం మల్కాపూర్‌లో నూతన పాలకవర్గం కొలువుదీరడంతో నిలిచిపోయిన స్వచ్ఛ భారత్ పనులు మళ్లీ మొదలయ్యాయి. ఆదివారం 6వ వార్డులో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్థులు, యూత్ సభ్యులు శ్రమదానం నిర్వహించి చెత్తాచెదారాన్ని తొలగించారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు.